Monday, 26 October 2015

రాజధాని లో పవన్ ఎంట్రీ ఎలా ఉంటుంది ?

ఎలాగైతేనేం అమరావతి శంకుస్థాపన పూర్తయింది. అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. అంతేకాకుండా.. ఏవో వరాలు కురిస్తాడని అనుకున్న మోడీ కూడా సైలెంట్ గా తన ప్రసంగాన్ని ముగించి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయారు. అట్టహాసం.. హంగామా అన్ని ముగిశాయి. ఇప్పుడు నిర్మాణం ఎలా చేపడతారు అన్న దానిమీదనే అందరి దృష్టి ఉన్నది.

అమరావతి నిర్మాణం చేపట్టాలి అంటే.. దాదాపుగా లక్షకోట్ల రూపాయల వరకు అవసరం అవుతాయి. రైతులు భూములైతే ఇచ్చారుకాని, డబ్బులు ఎవరు ఇస్తారు. ప్రభుత్వం ప్రారంభించిన మై బ్రిక్ మై అమరావతి పధకానికి మంచి ఆదరణ వచ్చింది.. కోట్ల సంఖ్యలో ఇటుకలను కొనుగోలు చేశారు. అమరావతి నిర్మాణంలో మేము సైతం అంటూ నెటిజన్లు తమవంతు సహాయం చేస్తూనే ఉన్నారు. ఎంత చేసినా నిర్మాణం కావాలి అంటే.. కేంద్రం నుంచి నిధులు రావాలి. కేంద్రం నుంచి నిధులు రావాలి అంటే కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి.

ఇకపోతే, రైతుల వద్ద నుంచి భూములను భూసేకరణ పద్దతి ద్వారా తీసుకోవడాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బహిరంగంగానే వ్యతిరేకించారు. భూములు స్వచ్చందంగా ఇస్తే తీసుకోవాలని.. భూసేకరణ ద్వారా తీసుకుంటే మాత్రం రైతుల తరపున పోరాటం చేస్తామని రాజధాని ప్రాంతంలో పర్యటించిన సమయంలోనే పవన్ చెప్పారు. పవన్ మాటలకు తలొగ్గిన ప్రభుత్వం భూసేకరణ చట్టం ప్రకారం భూములు సేకరించేందుకు వెనక్కి తగ్గింది. ఆ తరువాత తెలుగు దేశం పార్టీ… జనసేనల మధ్య అంతరం పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు రావాలి అంటే.. ఎవరో ఒకరు ఒత్తిడి తేవాలి. తెలుగుదేశం పార్టీ ఆ పనిచేయలేదు.. కాబట్టి పవన్ సహాయం తీసుకోక తప్పదు. రైతుల కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్దమన్న పవన్ కళ్యాణ్.. అందుకు ఒప్పుకుంటాడా.. లేదా అన్నది చూడాలి.

0 comments:

Post a Comment