మెగా ఫ్యామిలీ పై ఒక వర్గం మీడియా విషప్రచారం చేస్తుంది. మెగా మేటర్ లేకపోతె వాళ్ళ ఛానల్/వెబ్ సైట్ లకి ఫాలోయింగ్ తక్కువైంది అనుకున్నారేమో కాని రోజు ఏదో ఓ కొత్త ప్రచారం తో మెగా ఫాన్స్ ని అయోమయానికి గురి చేస్తునారు. చిరు, పవన్ లు కలిసే ఉన్నా నిన్న,మొన్నటి వరకు చిరు, పవన్ ఎడ మొహం పెడ మొహం గా ఉన్నారంటూ అంటూ ప్రచారం సాగించారు. ఐతే చిరు మళ్ళి సినిమాలలోకి రీఎంట్రీ ఇవ్వడం తో అన్నయకు అబినందనలు తెలపడానికి పవన్ స్వయం గా చిరు ఇంటికి వెళ్ళడం తో ఇక ఆ ప్రచారానికి అడ్డుకట్ట వేయక తప్పలేదు.
ఐతే ఇప్పుడు మరో కొత్త ప్రచారానికి తెర తీసారు వీళ్లు. పవన్ చిరు ఇంటికి వెళ్ళింది బ్రూస్ లీ కలెక్షన్స్ పెంచడానికి అట. వాళ్ళ చేసిన ఈ ప్రచారం వాళ్ళకే కామెడీ గా అనిపించి ఉండి ఇంకో వాదన తెరపైకి తీసుకొచ్చేసారు. మెగా ఫ్యామిలీ లో ముసలం స్టార్ట్ అయ్యింది అని అల్లు అరవింద్, చిరులు కొడుకుల కోసం విడిపోయారు అని చరణ్ ఫ్లాప్ మూవీస్ వెనుక అరవింద్ ఉన్నారు అని విష ప్రచారం స్టార్ట్ చేసారు.
నిజానికి బ్రూస్ లీ విషయం లో ఈ మీడియా చాల ఓవర్ గానే స్పందించింది బ్రూస్ లీ కి డివైడ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ మరి అంత ఘోరంగా ఏమి లేవు కాని వీళ్లు మాత్రం బ్రూస్ లీ కి మొదటి రోజు రెండో ఆట నుండే కలెక్షన్స్ విపరీతం గా పడిపోయాయి అని ప్రచారం చేసారు. బ్రూస్ లీ మొదటి వారం 34 కోట్ల పైన కల్లెక్ట్ చేసింది. మరి రెండో ఆట నుండే టికెట్స్ తెగడం ఆగిపోతే ఈ కలెక్షన్స్ ఎలా వచ్చాయో వారే చెప్పాలి మరి.

0 comments:
Post a Comment