పవన్ మళ్లీ రాజకీయ రంగం లోకి దిగానున్నడా ?? ... అంటే అవును అనే అంటున్నాయి ాజకీయ వర్గాలు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అమరావతి నిర్మాణం కోసం రైతుల దగ్గర నుండి భూమిని సమీకరిస్తున్న విషయం తెలిసిందే. ఐతే రాజధాని పరిధిలోకి వచ్చే కొన్ని గ్రామాల రైతులు తమ భూములు ఇవ్వలేమని తమ బ్రతుకు బండి వాటి మీదే నడుస్తునందున మమల్ని సమీకరణ నుండి మినహాయించాలని దీక్షలు చేసారు. అప్పట్లో ఈ విషయం తెల్సుకుని వీరితో మాట్లాడిన పవన్ అవసరమైతే రైతుల తరపున ఉద్యమం నిర్వహిస్తా అని ప్రభుత్వాని హెచ్చరించడం తో దిగివచ్చిన బాబు ప్రభుత్వం వాళ్ళని భు సమీకరణ నుండి పక్కకు తప్పించింది. ఐతే ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ భూ సమీకరణకు రైతులు సహకరించాలని లేకపోతే భూ సేకరణ చట్టం ద్వారా తామే రైతుల దగ్గర నుండి భూమిని తీసుకుంటాం అని నోటిఫికేషన్ జారి చేసింది. ఐతే సమస్య మళ్లీ మొదటికి రావడం తో రైతులు ఆందోళన చెందుతున్నారు. పవన్ మరోసారి తమ తరపున పోరాడి ఈ సమస్యకు శాశ్వతా పరిష్కారం చూపాలని రైతులు కోరుకుంటున్నారు.

0 comments:
Post a Comment