Saturday, 31 October 2015

సల్మాన్ సినిమాలో విలన్ గా రామ్ చరణ్

                           రామ్ చరణ్ చేయబోతున్న తని ఒరువన్ రీమేక్ గురించి ఫిలిం నగర్ సర్కిల్స్ లో ఆసక్తికరమైన వార్తోకటి  షికారు చేస్తుంది. తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా ఈ యాక్షన్ థ్రిల్లర్ ని తెలుగు లో రామ్ చరణ్ చేయబోతున్నాడు. ఈ సినిమా కి అన్ని కుదిరాయి కాని విలన్ గా ఎవర్ని తీసుకోవాలి అన్న దానిపై సినిమా యూనిట్ మల్లగుల్లాలు పడుతుంది. ఈ విషయం అలా ఉంచితే  తని ఒరువన్ రీమేక్ లో విలన్ గా చేయడానికి రామ్ చరణ్ రెడీ అయిపోయాడు.  

                          అదేంటి చరణ్ హీరో గా అనుకోవచ్చు కాని చరణ్ చేస్తుంది తెలుగు లో కాదు హింది లో. తని ఒరువన్ హింది రీమేక్ రైట్స్ ని సల్మాన్ ఖాన్ తీసుకున్నట్టు సమాచారం ఆయన హీరో గా నటించే ఈ  సినిమాలో ప్రతి నాయకుడిగా చేయడానికి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ విషయం కేవలం షికారు వార్త కాకుండా నిజం ఐతే మాత్రం ఇటు చరణ్ అభిమానులకే కాదు సినీ ప్రియులకు కూడా ఆనందమే. చరణ్ కి సల్మాన్ ఖాన్ కి మద్య ఉన్న స్నేహం అందరికి తెలిసిందే. చరణ్ ముంబై వెళ్ళినప్పుడల్లా సల్మాన్ ని తప్పకుండా  కలుస్తారు. చిరు షష్టిపూర్తి వేడుకలకు కూడా సల్మాన్ హాజారు అయ్యారు  

0 comments:

Post a Comment