జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు ఉదయం ఆంధ్ర ప్రదేశ్ సిఎం చంద్రబాబు ని కలుసుకోనున్నారు. ఐతే ఈ భేటి రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. కొన్ని రోజుల క్రితం జనసేన పార్టీ కి తెలంగాణా ఎన్నికల కమిషన్ గుర్తింపు ఇచ్చింది. దీని వల్ల జనసేన కు తెలంగాణా లో జరిగే ఎన్నికలకు పోటి చేయడానికి అవకశం ఏర్పడింది. వచ్చే జనవరి లో భాగ్యనగరం లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నడం తో పొత్తు పై చర్చించడానికి పవన్, బాబు దగ్గరికి వేల్తునారని ఉహాగానాలు ఏర్పడ్డాయి.
ఐతే పొత్తు విషయం కాదని అమరావతి నిర్మాణం, భూ, రైతు సమస్యలపై చర్చించాడానికి పవన్ బాబు ని కలుసుకోనున్నారు అని ఆయన సన్నిహితులు తెలిపారు. అమరావతి నిర్మాణ పరిధి లోకి వచ్చే నాలుగు గ్రామాల రైతులు భూములు ఇవ్వం అని గతం లో పోరాటం చేసారు వారికి పవన్ అండ లబించగా అప్పట్లో ప్రభుత్వం వారి భూమికి మినహాయింపు ఇచ్చింది. లేటెస్ట్ గ మళ్లీ ఆ భూములను ప్రబుత్వానికి అప్పగించాలని అధికారులు నోటీసు లు జారి చేయడం తో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. వారికోసం పవన్, బాబు తో ప్రత్యేకం గా మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది

0 comments:
Post a Comment