Friday, 20 November 2015

చరణ్ కోసం టాప్ హీరోయిన్ ల పోటి


ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ మధ్య గట్టి పోటీనే నడుస్తుంది. ఒకరి ఆఫర్స్ ని ఒకరు లాక్కోవటం, తనకు అవకాశం రాకపోయినా మరొకరికి ఆ అవకాశం రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలో..అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా టాప్ హీరోయిన్స్ విషయంలో జరగటంతో, అందరూ చేసేది ఏమి లేక...జరుగుతున్న విచిత్ర గొడవలను చూస్తూ ఊరుకుంటున్నారు. ప్రస్తుతం సమంత, తమన్న ల మధ్య గట్టి ఫైట్ నడుస్తుంది.

 ‘శ్రీమంతుడు’, ‘వేదాళం’ సినిమాలతో ఫాంలో ఉన్న శ్రుతిహాసన్, టాప్ హీరోల మూవీలలో ఆఫర్స ని ఈజీగా చేజిక్కించుకుంటుంది. అందులోనూ ఈ బ్యూటీకి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ మంచి మార్కెట్ ఉంది. శ్రుతిహాసన్ ని హీరోయిన్స్ గా తీసుకుంటే జరిగే ప్లస్ ఏంటంటే, ఈ బ్యూటీకి బిటౌన్ లో మంచి మార్కెట్ ఉండటంతో..ఈ మూవీకి సంబంధించిన హిందీ వెర్షన్ శాటిలైట్ రైట్స్ కి మంచి రేటు పలుకుతుందట.

అందుకునే శ్రుతిహాసన్ ని ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు. ఇక తాజాగా ‘తని ఒరువన్’ సినిమా రీమేక్‌లో నటించేందుకు శ్రుతిహాసన్ రెడీ అయింది. అయితే మరోవైపు నుండి తమన్న సైతం ఈ మూవీలో నటించేందుకు శ్రుతిహాసన్ కి గట్టి పోటీ ఇస్తుంది. వీరిద్దరికి రామ్ చరణ్ తో మంచి పరిచయాలే ఉన్నాయి. అందుకే రామ్ చరణ్ కి తమన్న రెగ్యులర్ టచ్ లో ఉంటుంది. ఎట్టిపరిస్థితుల్లో తని ఒరువన్ తెలుగు రిమేక్ లో నటించే ఆఫర్ ని శ్రుతిహాసన్ కి వెళ్ళకుండా తమన్న ప్లానింగ్ చేస్తుంది.

చరణ్ పై ఒత్తిడి తీసుకురావటమే కాకుండా, డైరెక్టర్ తోనూ మంతనాలు జరుపుతుందట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెలుగులో రీమేక్ చేస్తోన్న ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం మేరకు శ్రుతిహాసన్ ని దాదాపు ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. కానీ, చిత్ర యూనిట్ నుండి అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకూ, ఎవరు ఈ మూవీలో హీరోయిన్స్ గా ఛాన్స్ ని దక్కించుకుంటారో అనేది తెలియాల్సింది.

0 comments:

Post a Comment