Monday, 16 November 2015

షాక్ ఇస్తున చరణ్ నిర్ణయం

                                                                        

రామ్ చరణ్ అమెరికాలో సినిమాల స్క్రిప్ట్ రైటింగ్ నేర్చుకుంటూనే మరో వైపు కొన్ని సంచలన నిర్ణయాలు కూడ తీసుకుంటున్నాడు. చరణ్ ఈమధ్య కోలీవుడ్ లో విడుదలై హిట్ సాధించిన ’49-ఒ’ సినిమా రీమేక్ హక్కులను చడీచప్పుడు కాకుండా సొంతం చేసుకువడం టాలీవుడ్ లో సంచలన వార్తగా మారింది. ఈ సినిమాలో కోలీవుడ్ హాస్య నటుడు గౌండమణి హీరోగా నటించాడు. 

ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దగ్గర సహాయ దర్శకుడిగా పని చేసిన ఆరోగ్యదాస్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కోలీవుడ్ లో సైలెంట్ గా చిన్న సినిమాగా విడుదలైన ఈసినిమా మంచి హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈసినిమాను ఈమధ్య చూసిన చరణ్, ఈసినిమా పై మక్కువ పెంచుకుని ఈసినిమా రీమేక్ హక్కులను అమెరికా నుండే ఈ సినిమా నిర్మాతలతో మాట్లాడి కొన్నాడని టాక్. 

అయితే ఈ చిన్న సినిమాను ఇంత హడావిడిగా చరణ్ ఎవరి కోసం కొన్నాడు అంటూ టాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి. ఈమధ్య కాలంలో చరణ్ తన సొంత నిర్మాణ సంస్థను స్థాపించి ఆ బ్యానర్ పై వరసగా చిన్న సినిమాలు తీయాలని నిశ్చయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చరణ్ ఈసినిమాను కొన్నాడా? లేదంటే ఈసినిమాలోని సన్నివేశాలు చిరంజీవి 150వ సినిమాకు ఏమైనా పనికి వస్తాయని కొన్నాడా? అన్న విషయం పై రకరకాల కామెంట్స్ వినపడుతున్నాయి.

‘బ్రూస్ లీ’ షాక్ నుండి తేరుకుని చరణ్ అమెరికాలో రకరకాల విషయాల పై పాఠాలు నేర్చుకోవడమే కాకుండా వచ్చే నెలలో అమెరికా నుండి తిరిగి వచ్చిన తరువాత తాను చేయబోయే పనుల గురించి నిర్ణయాలు తీసుకుంటూ చరణ్ తన వేగాన్ని పెంచాడు అనుకోవాలి. ఇంతకీ ఈ 49-ఒ’ ఎవరికోసం అన్నది సస్పెన్స్.. 

0 comments:

Post a Comment