Tuesday, 17 November 2015

నిహారిక కు షాక్ ఇచ్చిన మెగా ఫ్యామిలీ

                    
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు మెగాస్టార్ కుటుంబం నుంచి మెగా హీరోలు వచ్చారు..మొట్ట మొదటి సారిగా నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. వాస్తవానికి సినిమా కుంటుంబానికి చెందిన నిహారిక మొదట బుల్లితెరపై యాంకర్ గా ఆకట్టుకుంది. ‘ఢీ’ డ్యాన్స్ ప్రోగ్రామ్ తో చలాకీగా యాంకరింగ్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది.

నిహారిక చిత్రానికి మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు' వంటి ప్రేమకథా చిత్రాన్ని అందించిన రామరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా టైటిల్ కూడా ఖరారైంది ‘ఒక మనసు' . మధుర శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగ శౌర్య హీరో. ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్-టివి 9 సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


నిహారిక టీవీ యాంకర్ గా చేస్తున్నంత సేపు మెగా ఫ్యామిలీ ఏం జోక్యం చేసుకోలేదు.. కానీ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడంతో కోపతాపాలకు గురైనట్లు తెలుస్తుంది. ఎందుకంటే నిహారిక హీరోయిన్ గా రావడం వాళ్ళకు ఇష్టం లేదట. మెగా హీరోలు ఎంత చెప్పినా వినకపోవడంతో ఇక చేసేది ఏమి లేక ఇప్పుడు వస్తే బాగుండదు ఆడియో వేడుకకు వస్తామాని చెప్పారట. కాగా   తాజాగా నిహారిక నటిస్తున్న కోత్తచిత్రం నిన్న లాంచనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది.

భారీ ఎత్తున లాంచింగ్ కార్యక్రమాలు జరుగుతాయనుకుంటే..సాదాసీదాగా ముగించేశారు. ఈ సినిమాలో నిహారిక తల్లి పాత్ర ప్రముఖ నటి రమ్య కృష్ణ చేయబోతున్నట్లు సమాచారం. సినిమాలో నిహారిక తల్లి పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని, అందుకే రమ్య కృష్ణ లాంటి స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.  మెగా ఫ్యామిలీ ఇమేజ్ ఏమాత్రం డ్యామేజ్ కాకుండా, నటిగా నిహారికకు మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఉంటుందని అంటున్నారు. మధుర శ్రీధర్, టీవీ 9 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎక్కువ భాగం షూటింగ్ వైజాగ్ లో జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించనున్నారు.

0 comments:

Post a Comment