చరణ్ చేయబోతున్న తని ఒరువన్ రీమేక్ లో విలన్ పాత్రకి మళ్లీ ఓ కొత్త పేరు వినబడుతుంది. ఇప్పటికే మాధవన్, నాగార్జున, అరవింద్ స్వామి వంటి వారి పేర్లు రోజుకొకటి గా వినిపించాయి. ఇప్పుడు ఆ లిస్టు లోకి మరో కొత్త పేరు వచ్చి చేరింది. విక్టరీ వెంకటేష్ ఈ పాత్రా చేయడానికి ఒప్పుకున్నట్టు ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తుంది.
దర్శకుడు సురేందర్ రెడ్డి అరవింద్ స్వామి ని విలన్ గా నటించమని ఒప్పించాక అమెరికా లో ఉన్న చరణ్ సురేందర్ రెడ్డి కి ఫోన్ చేసి అరవింద్ స్వామి ఎంపికను పెండింగ్ లో పెట్టమని వెంకి ఈ పాత్రకు ఒప్పుకునే అవకాశం ఉంది అని చెప్పాడట. ఇంతక ముందు గోవిందుడు అందరివాడేలే సినిమాలో వెంకి చరణ్ తో నటించాల్సి ఉన్న ఆ పాత్రా కు శ్రీకాంత్ కు వెళ్ళింది మరి ఇది ఐన వెంకి చేస్తాడో లేదో చూడాలి
0 comments:
Post a Comment