Sunday, 24 April 2016

"కత్తి" పదునుకి ముహూర్తం పెట్టిన చిరంజీవి

                                                                         

                     రెండు ఏళ్ళుగా మెగాభిమానులు ఎప్పుడేపుడా అని ఎదురు చూస్తున సమయం రానే వచ్చింది. చిరు 150వ సినిమా ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేసారు అని సమాచారం. ఇప్పటికే అభిమానులకు కూడా సందేశాలు వెళ్ళినట్లు తెలుస్తుంది. గత రెండు ఏళ్ళుగా చిరు బర్త్ డే  నాడు చరణ్ పుట్టిన రాజు నాడు ఓపెనింగ్ అంటూ వచ్చిన వార్తల పై ఇటు అభిమానులు అటు మీడియా కూడా విసుగు చెందాయి. సరైన కథ దొరక్క, కథ దొరికితే స్క్రిప్ట్ విషయం లో కన్ఫ్యూజన్ వల్ల ఇన్నాళ్ళు మెగాస్టార్ 150వ సినిమా ముందుకు కదల్లేదు. ఐతే కొన్ని రోజులుగా వినిపిస్తున వార్తల ప్రకారం వినాయక్ వినిపించిన స్క్రిప్ట్ ని విన్న చిరు చాల ఇంప్రెస్స్ అయ్యి ఆ స్క్రిప్ట్ ని ఫైనలైస్ చేశారట. ఇప్పటికే ఈ సినిమా కాస్టింగ్ అండ్ మిగతా నిర్మాణ కార్యక్రమాలు కూడా పూర్తీ అవ్వడం తో ఈ నెల 29 న సినిమా ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు చెప్తునారు.
                      ఐతే ఇంత హడావిడి గా ముహూర్తం ఫిక్స్ చేయడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి అంటునారు. ఈ నెల 29 తరువాత వచ్చే 2 నెలలు ముహూర్తాలు లేవని ఆపై కృష్ణ పుష్కారాలు ఉండటం తో మంచి ముహుర్తాలు ఉండవని పండితులు చెప్పటం తో 29 వ తేదిన మూవీ ని స్టార్ట్ చేయాలనీ ఫిక్స్ చేశారట మెగా ఫ్యామిలీ. 
                      ఐతే ఈ సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ "కత్తి" కి రీమేక్ అని తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ సినిమాని రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తునారు.
  

0 comments:

Post a Comment