Thursday, 28 April 2016

ఆసక్తి రేపుతున్న చిరు నిర్ణయాలు


                                                                      

                        ఎన్నాళ్లగానో మెగాభిమనులు ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమయింది. మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా కు రేపు మద్యాహ్నం 1:30 నిమిషాలకు కొబ్బరికాయ కొట్టనున్నారు. అదిగో సినిమా ఇదిగో సినిమా అంటూ రెండేళ్ళ నుండి ఊరించి ఊరించి ఆఖరికి రేపు ముహూర్తం ఖరారు చేసారు.ఐతే రెగ్యులర్ షూటింగ్ ఎప్పటినుండి అనేది మాత్రం ఇంకా తెలియరాకున్న చిరు నిర్ణయాలు కొన్ని మీడియా లో హల్చల్ చేస్తున్నాయి. 
                         టాలీవుడ్ లో చిన్నహీరో నుండి పెద్ద హీరో వరకు చిన్న నిర్మాత నుండి పెద్ద నిర్మాత, దర్శకుడు వరకు ప్రతి ఒక్కరికి సెంటిమెంట్స్ ఉంటాయి. ఐతే చిరంజీవి కూడా వీటికి అతీతుడు కాదని తేలింది.  ఈ సినిమా ముహూర్తపు షాట్ కోసం మెగాస్టార్ ఒక ఇంటిని అద్దె కు తీసుకున్నారట.ఆ ఇల్లు ఆయనకు అచ్చి వచ్చిన ఇల్లు అట. ఆయన కెరీర్ తొలినాళ్ళలో ఇండస్ట్రీ లో నిలదోక్కుకునేప్పుడు  అదే ఇంట్లో ఉండేవారట. ఐతే ఆ తర్వాత ఆయన సొంత ఇల్లు కట్టుకోవడం తో ఆ ఇంటి ని వదిలేసారు. అల్లు అరవింద్ కూడా ఆ ఇంట్లో కొన్నాళ్ళు ఉన్నారట. ఐతే ఆ ఇంట్లో ఉన్నాకనే తాము వృద్ది లోకి వచ్చాం అని నమ్మకం తో మళ్లీ  అదే ఇంటిని అద్దె కు తీసుకుని చిరు 150 వ సినిమా ముహురపు షాట్ పూజ కార్యక్రమాలు అక్కడ నిర్వహించానున్నారట. హైదరాబాద్ లోని జుబ్లిహిల్ల్స్ చెక్ పోస్ట్ సమీపంలో ఆ ఇల్లు ఉన్నట్టు సమాచారం. 
                         ఇదికాకా చిరు మరో నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా ముహూర్తపు షాట్ సమయం లో ఇప్పటికి వరకు తన సినిమాలకు హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా తన సినిమాలు కొని  తన వెన్నంట ఉన్న డిస్ట్రిబ్యూటర్ లను కూడా ఆయన ఆహ్వానించారు. 
                          ఈ ఫంక్షన్ కి అబిమానులను దూరంగా ఉంచారు. కేవలం కుటుంబసభ్యులు, వ్యక్తిగత  స్నేహితులు, డిస్ట్రిబ్యూటర్ లకు మాత్రమె ఆహ్వానాలు పంపారు. 

0 comments:

Post a Comment